2054 లో ఇవి ఇలా ఉండొచ్చు... వీళ్ళు అలా ఉండొచ్చు అని చిలిపి ఊహ!
ఆహారం:
ఇడ్లీ పిల్స్... భోజనం ఇంజెక్షన్స్... విందు పేరెత్తకుండా వాక్సిన్!
మొబైల్ ఫోన్:
స్క్రీన్ సైజు పెరిగి పోయి ఒక్కో ఫోన్ చేట అంత ఉంటుందేమో... దాని మీద రుద్దుకోటానికి రోకలి అంత స్టైలస్ ఉంటుందేమో... ఇవన్నీ మోయటానికి రోబోలు కొనుక్కుంటామేమో!
నీళ్ళు:
మ్యూజియంలో ఉంటాయేమో!
ముద్దు:
కాలుష్యం ఎక్కువైపోతే అందరు మాస్కులు వేస్కుని తిరుగుతుంటే ఇంకా ముద్దేంటి నా బొంద!
జీతం:
ఇప్పుడే హైక్ అని చెప్పి వేరుశనగలు ఇస్తున్నారు... అప్పుడు ఆవాలు ఇస్తారేమో?!
మొక్కలు... చెట్లు:
అంటే?
సర్జరీ:
ఆఫీసుకి వెళుతూ దారిలో ఆగి చేయించుకుంటామేమో!
పెళ్ళిళ్ళు:
అమ్మాయి దొరికితే ఎదురుకట్నం ఇవ్వాలేమో... దొరక్కపోతే ఇంకో అబ్బాయినే చేస్కోవాలేమో!!
తెలుగు:
వాట్ ద.... ఈజ్ టెల్గు బ్రో?!
అమెరికా:
అందరి మీద దాడి చేసి చేసి విసిగొచ్చి, గ్రహాల మీద పడతారేమో.
రాజమౌళి:
బాహుబలి తర్వాత ఇంకో రెండు సినిమాలు తీస్తాడేమో!
నేను:
అప్పటికి కూడా పని పాట లేకుండా ఇలా రాస్కుంటూనే ఉంటానేమో!