Monday, June 13, 2016

పకోడీలు - 5


సెంటర్ ఇచ్చేదేమో నిధుల రేషన్
బాబు గారికేమో అది పరేషాన్
పేరు గొప్ప తోనే మిగిలిన అమరావతి
ఏర్పడి మూడేళ్ళయినా అదే గతి!
 


గెలిపించండి నా దూకుడు చూపిస్తా అన్నాడు ఎమ్మెల్యే
గెలిపిస్తే అభివృద్ధి చేస్తాడేమో అనుకున్నాడు  పిచ్చోడి మల్లె
ఈ పార్టీ నుండి ఆ పార్టీకి దూకాడు ఈ రోజు

అభివృద్ధి ఎవరి కోసమో అర్ధమైన పిచ్చి మారాజు!



దూరం చేసిన కులమే దగ్గర చేసిందా?
లేకపోతే అవకాశం కనపడిందా?
దాసరి, చిరు లని కలిపిన ముద్రగడ
కాబోతోందా కొత్త ఎత్తుగడ?!

Wednesday, June 8, 2016

"గుంత"ముగ్గులు!

బెంగుళూరుకి వచ్చాయి వాన మబ్బులు
నీళ్ళు చల్లి వేసాయి "గుంత"ముగ్గులు
ముచ్చటేసి ముద్దాడితే మన బైకులు
విరగకుండ ఉంటాయా మన నడుములు!!