Thursday, May 21, 2020

పకోడీలు - 6




రెండు వేల ఇరవై 
గుండె ఏమో చెరువై 
మనశ్శాంతి కరవై
జ్ఞాపకమే బరువై 




కంటికే కనిపించని ఒక జీవి విలయం
ఇది చాలక కూడా వచ్చింది ప్రకృతి ప్రళయం 
బాగా  గుర్తు పెట్టుకోమని హెచ్చరికా ఇవి ప్రకృతి నుండి?
తుడిచేస్తే బాగుణ్ణు ఈ సంవత్సరాన్ని మెమరీ లో నుండి!


పగటి పూటనే బయటికి వెళ్లాలంటేనే బయ్యం బయ్యం
మనల్నెక్కడ పట్టుకుంటుందేమో ఆ కరోనా దెయ్యం
ఎన్నిపెట్టుకోవాలో తెలీడంలేదు కూరగాయలు, బియ్యం
ఎక్కువ తీసుకెళ్లి కుళ్ళిపోతే అదొక కయ్యం!







బట్టలుతికి, బియ్యంకడిగితే పనైపోతుందా?
నీ లాప్టాప్ వేడికి అన్నం ఉడుకుతుందా?
బగ్గు సంగతి తర్వాత చూద్దువు గాని
నిగ్గు తేల్చరా ఇవాళ్టి కూరసంగతి!

1 comment:

  1. రెండు వేల ఇరవై
    గుండె ఏమో చెరువై
    మనశ్శాంతి కరవై
    జ్ఞాపకమే బరువై

    It is not comedy...very serious post.

    ReplyDelete